Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్.. ఈ అచ్చ తెలుగమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఏపీకి చెందిన ఈ అమ్మాయి తెలుగు సినీప్రియులకు చాలా ఇష్టమైన హీరోయిన్. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెకండ్ హీరోయిన్ గానూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్.

Tollywood: ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్.. ఈ అచ్చ తెలుగమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?
Anjali
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 13, 2025 | 3:11 PM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.. ? తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టి సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించే అందమైన హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అంజలి. ఏపీకి చెందిన ఈ అమ్మాయి.. జీవా నటించిన డేర్ సినిమాతో తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలు అంజలికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ తమిళంలో సూపర్ హిట్ అయిన షాపింగ్ మాల్ సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయగా.. అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన జర్నీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు అంజలి కెరీర్ మలుపు తిప్పాయి. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో కనిపించింది. అంజలి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

గ్లామర్ షోలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన అంజలి.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీలో కీలకపాత్ర పోషించింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..