Thandel: మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల్లు బీభత్సం సృష్టిస్తోంది తండేల్ చిత్రం. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.21.27 వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో నటించిన తండేల్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో భారీగా వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే ఈ సినిమాకు రూ.21.27 కోట్లు రాబట్టింది. విడుదలై వారం రోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తండేల్ జోరు తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ వంద కోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతుంది. దీంతో ఇప్పుడు తండేల్ చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్లలో మునిగిపోయింది. తండేల్ మూవీ టీం నిన్న తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సినిమాలో చైతూ సరసన మరోసారి సాయిపల్లవి కథానాయికగా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీర్దదరు కలిసి నటించిన తండేల్ మూవీ సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఇక చైతూ, సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. తాజాగా ఈ సినిమా టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ సైతం పాల్గొన్నారు. ఇక వేదికపై హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. గతంలోనూ తండేల్ మూవీ ఈవెంట్లలో సాయి పల్లవితో కలిసి స్టెప్పులేశారు అల్లు అరవింద్. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.
తండేల్ సినిమాకు మరో హైలెట్ అయ్యింది మ్యూజిక్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. శ్రీకాకుళంకు చెందిన డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్య్సకారుల జీవితం.. పాకిస్తాన్ లో వారు పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీంతో ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి హైప్ నెలకొంది.
Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0
— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన