Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ క్రేజీ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. అందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటూ కనిపించాడు ఆ కుర్రాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత హీరోగా వెండితెరపై సందడి చేశాడు.

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. ఒకప్పుడు బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగులో ఏకంగా 40 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిన్నప్పుడే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. అలాగే అనేక అవార్డ్స్ సైతం సొంతం చేసుకున్నాడు. ఉత్తమ బాలనటుడిగా రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాడు. అప్పట్లో తెలుగులో అత్యధిక అభిమానులు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అతడే. ఆ తర్వాత హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రేమకథ చిత్రాలు, కామెడీ సినిమాలతో మెప్పించాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయాడు. అతడు మరెవరో కాదు.. హీరో బాలాదిత్య.
చిన్నప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించాడు. హీరోగానూ పలు సినిమాల్లో కనిపించాడు. కానీ సరైన బ్రేక్ అందుకోలేకపోయాడు. బుల్లితెరపై పలు సీరియల్స్, టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. రాజశేఖర్ నటించిన అన్న సినిమాగానూ, లిటిల్ సోల్జర్స్ సినిమాలకు గానూ బాలాదిత్య ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నాడు. నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో మొదటి సారిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక ఆ తర్వాత తెలుగులో జంబలకిడి పంబ, బంగారు బుల్లోడు, అబ్బాయిగారు, అత్తింట్లో అద్దె మొగుడు, రౌడీ గారి పెళ్లాం, లిటిల్ సోల్జర్స్ సమరసింహారెడ్డ, హాలో బ్రదర్ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత 2003లో చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సుందరానికి తొందరెక్కువ, రూమ్ మేట్స్, జాజిమల్లి, 1940లో ఒక గ్రామం వంటి చిత్రాల్లో హీరోగా కనిపించాడు. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బాలాదిత్య.. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..