AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Karthi: ఈసారి బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. 15 ఏళ్లకు రిలీజ్ కానున్న కార్తీ సూపర్ హిట్..

సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు మరోసారి విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఒకప్పుడు ప్లాప్ అయిన చిత్రాలు మళ్లీ రిలీజ్ చేయగా.. ఊహించని రెస్పాన్స్ అందుకున్నాడు. అంతేకాకుండా భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు ఓ సూపర్ హిట్ సినిమాను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు.

Actor Karthi: ఈసారి బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. 15 ఏళ్లకు రిలీజ్ కానున్న కార్తీ సూపర్ హిట్..
Yuganiki Okkadu
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2025 | 5:46 PM

Share

సినీరంగంలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హిట్, ప్లాప్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు థియేటర్లలో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ రీరిలీజ్ ట్రెండ్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తాజాగా కోలీవుడ్ హీరో కార్తీ కెరీర్ మలుపు తిప్పిన ఓ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే యుగానికి ఒక్కడు.

కోలీవుడ్ స్టార్ సూర్య తమ్ముడు కార్తీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అతడు నటించిన చిత్రాలన్నీ అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక కార్తీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా యుగానికి ఒక్కడు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీమా సేన్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ నటుడు ఆర్. పార్థిబన్ కీలకపాత్ర పోషించారు. 2010 జనవరి 14న విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

వచ్చే నెల మార్చి 14న ఈ సినిమాను ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, అమెరికాలోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు ఈ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ప్రైమ్ షో ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us
MS Dhoni: ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!
MS Dhoni: ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!