Jr.NTR: ఎన్టీఆర్తో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ? నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో చక్కర్లు కొడుతుంది. అందులో తారక్ తో కలిసి ఉన్న ఈ చిన్నారి ఎవరంటూ నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మాత్రం నెట్టింట క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. హీరోహీరోయిన్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా జనాల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. అమాయకమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక. ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రంలో కనిపించింది. అలాగే విక్టరీ వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి సినిమాలోనూ కనిపించింది. ఈ చిత్రంలో వెంకీ అన్న కూతురిగా నటించింది. ముద్దు ముద్దు మాటలతో అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆక్టటుకుంది.
ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన గ్రీష్మ.. ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి చేంజ్ అయిపోయింది. ఆమె మేకోవర్ చూసి అందరూ షాకవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా మోడ్రన్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. చిన్నది చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది.
తెలుగులో అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది గ్రీష్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోస్ షేర్ చేస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








