Video: తొందర్లో ఎంత పని జరిగిపోయిందక్క..! సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ రైల్వే గేటును దాటి బైక్‌పై వెళ్లే ప్రయత్నంలో కిందపడిపోయింది. ఈ ఘటన ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల ఏర్పడే ప్రమాదాలను హైలైట్ చేసింది. నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంతమంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడంతో పాటు వాళ్లు కూడా ఇబ్బందుల పాలవుతుంటారు. వాళ్లు చేసే తప్పులు కొన్నిసార్లు ప్రాణాలపైకి తెస్తుంటాయి. రోడ్లపై వాహనాలు తోలే కొంతమంది అస్సలు ఓపిక అనేదే ఉండదు. ఏదో అత్యవసర పని ఉన్నట్లే ఆగమేఘాలపై వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు పడినా దాని కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంగా ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఓ మహిళ బైక్‌పై కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుంది. దారి మధ్యలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేసి ఉంటుంది. ఆమెతో పాటు చాలా మంది ఆగి ఉంటారు. కొంతమంది క్రాసింగ్ దాటి వెళ్తుంటారు. ఆమె కూడా త్వరగా ఇంటికి చేరుకోవాలని గేటును చేత్తో పైకెత్తి, బైక్‌ను ముందుకు పోనిచ్చింది. కానీ, గేటు ఆమె ముఖానికి ముందు భాగంలో పడటంతో వెనక్కి పడిపోయింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు తప్పు ఆ మహిళదే అంటూ విమర్శిస్తున్నారు. కాస్త గేటు తీసే వరకు ఆగొచ్చు కదా అక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ వీడియోను 1 కోటి 60 లక్షల మందికి పైగా చూశారు. 9 లక్షలకు పైగా లైక్‌లు, 6500 కంటే ఎక్కువ కామెంట్ల వచ్చాయి.
వీడియో చూడండి..
View this post on Instagram
