Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలనీలో అంతు చిక్కని మంటలు.. ఆ ఆత్మ పనే అంటున్న స్థానికులు.. వీడియో?

కాలనీలో అంతు చిక్కని మంటలు.. ఆ ఆత్మ పనే అంటున్న స్థానికులు.. వీడియో?

Samatha J

|

Updated on: Mar 09, 2025 | 3:01 PM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కాలనీలోని ఇళ్లన్నీ మంటలు అంటుకొని దగ్ధమవుతున్నాయి. రాత్రి పగలు తేడాలేకుండా ఇళ్లు తగలబడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. అయినా మంటలు ఆగడంలేదు. ఎక్కడో ఓ దగ్గర మంటలు చెలరేగుతూ కాలనీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు గత మూడు నెలలుగా ఇలా మంటలు చెలరేగడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో ఆ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు . రాత్రి, పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ మంటల మిస్టరీ ఏంటో తెలియక భూతవైద్యులను, మంత్రగాళ్లను సైతం సంప్రదించామని, వారు గట్టుమైసమ్మకు బోనాలు సమర్పించమని చెప్పడంతో బోనాలు సమర్పించామన్నారు. ఇలా వారు చెప్పిన దేవతలందరికీ మొక్కులు చెల్లించామన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులు మంటలు చెలరేగడం ఆగింది. మూడు నెలల తర్వాత మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని గుడిసెలు మంటలు అంటుకొని తగలబడిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు మానుకొని ఇంటికి కాపలా కాస్తున్నామని బాధపడుతున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా ఈ మంటలు చెలరేగడానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఆత్మ తిరుగుతూ ఉందని, దానిని తను చూసానని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ఇదంతా ఆ ఆత్మ చేస్తున్న పనేనని, ఈ మంటలకు కారణం ఆ ఆత్మేనని అంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో

ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్‌ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో

చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో

Published on: Mar 09, 2025 02:58 PM