చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో
పెళ్లి వేడుకలో వధువు తరపు వారు బంగారం, భూములు, ఇళ్లు వంటి విలువైన వస్తువులు ఇవ్వడం కామన్..! కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ అన్న తన చెల్లి పెళ్లికి ఊహించని వినూత్న కానుక ఇచ్చి అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ఆ అన్నయ్య ఇచ్చిన కానుకను చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఏం చేశాడు? ఆ అపురూప కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే! పెళ్లి వేడుకలో వధువుతో సహా అక్కడున్న వాళ్లంతా బోరున విలపించిన వినూత్న ఘటన ఇది. ఏడాది క్రితం తండ్రి చనిపోయి దుఃఖంతో తల్లడిల్లుతున్న ఆ వధువుకు తన అన్నయ్య అదిరిపోయే కానుక ఇచ్చాడు. ఆరడుగుల ఎత్తుతో తండ్రి విగ్రహాన్ని తయారు చేయించి.. ఆ పెళ్లి వేడుకలో ఆమెకు అపురూప కానుకగా ఇచ్చాడు. ఇది చూసి అంతా అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణా హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగింది.
వడిచర్ల శ్రీనివాస్ అనే మండల స్థాయి నాయకుడు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కూతురు శివాని అంటే ప్రాణం. మార్చి3న శివాని వివాహం జరిగింది. ఈ వేడుక సందర్భంగా తండ్రి కూతుర్ల అనుబంధం జీవితమంతా చెరగని జ్ఞాపకంగా ఉండాలని భావించిన శ్రీనివాస్ కుమారుడు కమలహాసన్ తన చెల్లికి ఈ గిఫ్ట్ ను ఇచ్చాడు. ఆరడుగుల ఎత్తుతో తన తండ్రి శ్రీనివాస్ విగ్రహాన్ని అందంగా తయారుచేయించాడు. ఈ విగ్రహానికి తానే గుడి కట్టించి తండ్రిని జీవితమంతా దైవంలా పూజించాలని నిర్ణయించాడు. పెళ్లి వేడుకలో అచ్చం తన తండ్రిని పోలిన విగ్రహాన్ని చూసిన వధువు శివాని బోరున విలపించింది. వధువుతో సహా అక్కడున్న వారంతా ఈ సన్నివేశాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వినూత్న.. కానుక కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించింది.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
