బావి నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్ వీడియో
ఓ పాడుబడ్డ బావిలో పాము ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో ఈ దృశ్యం కనిపించింది. అది పైకి వచ్చేందుకు ఐదు రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తోంది కానీ సాధ్యపడటం లేదు. అప్పటికే అది బాగా నీరసించిపోయింది. అందుకే అది బావిలోనే తచ్చాడుతోంది. దీంతో ఈ పాము గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.వారు పాములను రెస్క్యూ చేసే స్నేక్ క్యాచర్ భార్గవ్‌కు సమాచారం ఇచ్చారు.
పామును కాపాడేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ భార్గవ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగి రెస్క్యూ చేసి దాన్ని కాపాడారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా తన ప్రాణానికి ముప్పని తెలిసినా… పాము కోసం భార్గవ్ రిస్క్ తీసుకోవడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పాడుబడిన బావిలో నుండి పామును తీసిన భార్గవ్ దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. వేసవికాలంలో జనావాసాల్లోకి పాములు రావడం సహజం అని.. వాటికి హాని తలపెట్టకుండా.. కాపాడుకోవడం మనందరి బాధ్యత అని భార్గవ్ చెప్పారు. ఎండ తీవ్రత నేపథ్యంలో.. పాములు నీరున్న ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భార్గవ్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
