Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ ఏంచేసిందంటే!

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ ఏంచేసిందంటే!

Samatha J

|

Updated on: Mar 07, 2025 | 5:24 PM

చాలామంది జంతు ప్రేమికులు కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కుంటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటితో చాలా అనుబంధాన్ని పెంచుకుంటారు. పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తుంటారు. వాటికి ఏదైనా అనారోగ్యం చేసినా, ప్రమాదం జరిగినా తట్టుకోలేరు. తాజాగా ఓ మహిళ తన పెంపుడు పిల్లి చనిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అమ్రోహా జిల్లా మొహల్లా కోట్‌కు చెందిన పూజాదేవికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి హసాన్‌పూర్‌లో తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉంటోంది. మూడేళ్ల క్రితం రోడ్డుపై కనిపించిన ఓ పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటోంది. ఏమైందో ఏమో కానీ, గురువారం ఆ పిల్లి చనిపోయింది. దానిని తీసుకెళ్లి పాతిపెట్టేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆ పిల్లి తిరిగి బతుకుందని, దానిని పాతిపెట్టవద్దని చెప్పింది. అలా మూడురోజులపాటు చనిపోయిన పిల్లితోనే గడిపింది. పిల్లి బతక్కపోవడంతో మనస్తాపం చెందిన ఆ మహిళ శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు మందులు కూడా వాడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కాగా, కొన్నేళ్ల క్రిం ఆమె తండ్రి చనిపోగా, సోదరుల్లో ఒకరు మానసిక వ్యాధితో చనిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో