Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో

Samatha J

|

Updated on: Mar 05, 2025 | 6:33 PM

పబ్‌జీలో పరిచయమైన ఉత్తర్ ప్రదేశ్‌ యువకుడు సచిన్ మీనా కోసం భర్త, పిల్లలను వదిలేసి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చేసిన సీమా హైదర్ వ్యవహారం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ జంట గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఈ జంటకు ఇప్పటికీ పాపులారిటీ తగ్గలేదనడానిికి వారి సంపాదనే ఇందుకు నిదర్శనం. సచిన్ మీనా, సీమాలు తమ జీవనోపాధికి అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతోంది. భారత్‌లోకి వచ్చి పబ్‌జీ ప్రియుడ్ని పెళ్లాడి.. మతం మార్చుకుంది సీమా హైదర్‌.

ప్రస్తుతం ఈ జంట ఏకంగా ఆరు యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నారట. ఇందులో విభిన్నమైన కంటెంట్ అందిస్తూ.. వ్యూస్ రాబట్టి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారట. ఓ జాతీయ మీడియాతో సీమా మాట్లాడుతూ… యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత తనకు తొలి సంపాదనగా 45,000 రూపాయలు వచ్చిందని చెప్పింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1 లక్షకు పైగా సంపాదిస్తున్నామని చెబుతోంది.యూట్యూబ్ వ్యూస్, లైవ్ స్ట్రీమింగ్ సమయంలో డొనేషన్లు, స్పాన్సర్ వీడియోలు, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా ఈ మొత్తం వస్తోందని సీమా తెలిపింది. మొత్తం ఆరు యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టిన సీమా, సచిన్‌లు . ఇందులో తమ జీవన విధానం, కుటుంబ జీవితాన్ని వీడియోలుగా చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ ఛానెళ్లకు మొత్తం 17 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఒక్కో వీడియోకు సగటున 25 వేల వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో తన ఉద్యోగానికి సచిన్ రాజీనామా చేశాడు. పూర్తిగా యూట్యూబ్‌పైనే ఫోకస్ పెట్టి.. మరింత భిన్నమైన కంటెంట్ వీడియోలను క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో

అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో

ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో

అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో

Published on: Mar 05, 2025 06:32 PM