అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో
మానవులకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి భూమి మీద తప్పా.. మరెక్కడ నీటిజాడలు కనుక్కోలేదు. జీవం పుట్టుకకు నీరే ప్రాణాధారమనేది శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే మనకు తెలిసిన చంద్రుడితో సహా ఇతర గ్రహాల మీద నీటి ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? అని నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం, భవిష్యత్తులో మానవ నివాసానికి అవకాశాలను తెలుపుతుంది. గతంలో అంగారక గ్రహం భూమిలాగే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సువిశాల విశ్వంలో ఒక్క భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై కూడా జీవం ఉన్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అది కనిపెట్టేందుకే అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేస్తున్నారు.
అలాగే ఒక్క భూమిపైనే కాకుండా మన సౌరకుటుంబంలో భాగమైన ఇతర గ్రహాలపై మనిషి నివశించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా పరిశోధనలు జరుపుతున్నారు. వాటిలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, అంగారక గ్రహాల ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ.. అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు.. దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఇసుక బీచ్‌ల ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి.అధునాతన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్‌తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి, అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. ఈ విప్లవాత్మక అన్వేషణ అంగారక గ్రహం గతం గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే విషయంతో పాటు, భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశను కూడా ఇస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటివరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..
బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో
అక్బర్ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో
ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
