Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్‌

అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్‌

Phani CH

|

Updated on: Mar 03, 2025 | 8:21 PM

అంగారకుడిపై మానవాళి మనగడ సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అరుణ గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని 1970లలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన మెరైనర్‌-9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో తేలింది. తాజాగా అంగారక గ్రహంపై 300 కోట్ల ఏల్లనాటి బీచ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అందించిన డేటా ఆధారంగా వారు ఈ ఆవిష్కారం చేశారు. 1970లలోనాసాకు చెందిన మెరైనర్‌-9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో అరుణగ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని వెల్లడైంది. దీంతో ఆ గ్రహంపై ఎప్పుడైనా జలధారల జాడ ఉండేదా అన్న చర్చకు అది ముగింపు పలికింది. నాటి నుంచి అరుణ గ్రహంపై నీటి ప్రవాహానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ గ్రహంపై 450 కోట్ల ఏళ్ల కిందటే నీరు ఉండేదనడానికి అంగారకుడి నుంచి వచ్చిపడ్డ ఉల్కల్లో ఆధారాలు లభ్యమయ్యాయి. గత కొన్నేళ్లలో అంతరిక్ష శిలల ఢీ వల్ల అక్కడ ఏర్పడ్డ బిలాల్లోని ఉపరితలం కింద ఐస్‌ ఉన్నట్లు కూడా తేలింది. అయితే అరుణగ్రహంపై ఈ నీరు ఎప్పుడు ఉండేది? ఎంత పరిమాణంలో ఉండేది? ఎంతకాలం మనుగడ సాగించింది? వంటి ప్రశ్నలు కీలకంగా మారాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.. ఫోన్‌ వాయిస్ అమ్మాయి ఎవరంటే

తమ్ముడిపై అన్న సెటైర్! సైలెంట్‌గా ఇచ్చిపడేశాడుగా

క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్‌ కేస్‌! రియాక్టైన స్టార్ హీరోయిన్ !

ఆయన ఫోన్ చేస్తే.. ప్రభాస్ భయపడిపోయాడట..

pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్‌ పీలింగ్సే.. పీలింగ్స్‌!