ఆయన ఫోన్ చేస్తే.. ప్రభాస్ భయపడిపోయాడట..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యలో కన్నప్ప సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కన్నప్ప సినిమాలో నటించమని అడిగేందుకు మంచు విష్ణు ప్రభాస్‌కు కాల్ చేశాడట. అటు పక్క కాల్ లిఫ్ట్ చేసిన ప్రభాస్.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు చెప్పాడు. అయితే ముందుగా నాన్న మోహన్ బాబు ఇదే విషయంగా ప్రభాస్‌కు ఫోన్ చేయడంతో.. రెబల్ స్టార్ కాస్త భయపడ్డాడని నవ్వుతూ చెప్పాడు మంచు విష్ణు. అంతేకాదు తాను భయపడిన విషయాన్ని ప్రభాసే తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడని, ఏదైనా పనుంటే నువ్వే కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే మంచు విష్ణు చెప్పిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అట్లుంటది మోహన్ బాబుతోని అనే ఫన్నీ కామెంట్ నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్ పీలింగ్సే.. పీలింగ్స్!

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
