pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్ పీలింగ్సే.. పీలింగ్స్!
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై దగ్గర దగ్గర మూడు నెలలైంది. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. అలాగే కలెక్షన్స్ పరంగాను పుష్ప 2 అదరగొట్టింది. ‘బాహుబలి 2’ కలెక్షన్లను కూడా అధిగమించింది. ఇక ఓటీటీలో స్ట్రీమింగ్‌లోనూ పుష్ప2 దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే గ్లోబల్ వేదికపై కూడా పుష్ప2 హవా కొనసాగుతోంది. ‘పుష్ప 2’ సినిమాతో పాటు.. పుష్ప 2 సినిమాలోని సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ విన్న ప్రతీ సారి అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. ఇక అందులో ఫీలింగ్స్ సాంగ్స్ అయితే మరింతగా పాపులర్ అయింది. త్రూ అవుట్ వరల్డ్ హిట్టైపోయింది. ఇక ఇదే సాంగ్ ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ మ్యాచ్ మధ్యలో వినిపించింది. అమెరికాలోని టెక్సాస్ లో హ్యూస్టర్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ టీమ్స్ మధ్య బాస్కెట్ బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ లో ఆడియన్స్ ను ఖుష్ చేయడానికి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేశారు. పుష్ప 2లోని పీలింగ్స్ సాంగ్ కు స్టెప్పులేశారు. 45 మంది డ్యాన్సర్స్.. పుష్ప 2చిత్రంలోని పీలింగ్స్ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఐకానిక్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేగి పండు మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి.. చివరకు
తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు ఇవే
పిల్లి గోళ్లు ఇంత ప్రమాదమా..? యువకుడి ప్రాణమే పోయింది.. ఎలాగంటే
వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్ వేస్తారా?
బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

