బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో
ఓ రెండేళ్ల చిన్నారికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు భయంతో పరుగు పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రేలో కనిపించింది చూసి డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. రెండు వారాల క్రితం రెండేళ్ల చిన్నారి విచిత్ర పరిస్థితుల్లో ఆస్పత్రిలో జాయిన్ అయింది. అనంతరం శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ఆమె కడుపులో నుంచి 27 చిన్న చిన్న అయస్కాంతాలను తొలగించారు.
ఈ అయస్కాంతాల కారణంగా చిన్నారి పేగు, కడుపులో చిల్లులు పడ్డాయని డాక్టర్లు చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన బిన్‌హొ సిటీలో నివాసముంటున్న డికా అనే రెండేళ్ల చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరింది. అక్కడున్న డాక్టర్లు సదరు చిన్నారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తీయగా.. కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెకు ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు. కడుపులో నుంచి 11 అయస్కాంతాలు తొలగించడంతో పాటు.. పేగుల మధ్య ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తీశారు. ఇక డుయోడినమ్ దగ్గర ఉన్న చిన్న ప్రేగులోకి ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తొలగించి చిన్నారికి కుట్లు వేశారు డాక్టర్లు. దాదాపుగా 3 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సతో మొత్తం మొత్తం 27 అయస్కాంతాలను తొలగించి.. అమ్మాయికి పునర్జన్మను అందించారు డాక్టర్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు
డాక్టర్ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?
36 పేజీలలో 36 పెళ్లి తంతు వివరాలు ఈ శుభలేఖ వెరీ స్పెషల్
తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
