డాక్టర్ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పదమే వినిపిస్తోంది. ఏఐ రాకతో మానవ జీవన విధానమే మారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తును అంతా ఏఐ శాసిస్తుందని టెక్ నిపుణుల అంచనా. రోజురోజుకు అన్ని రంగాలకు ఏఐ విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
కృత్రిమ మేథస్సులో పిలిచే ఈ టెక్నాలజీ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ ఎంట్రీ ఇచ్చింది. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి రోబోల సహాయంతో ఆపరేషన్లు కూడా చేస్తుండటం సంచలనంగా మారింది. అయితే ఏఐ టెక్నాలజీని వైద్యరంగంలోకి మరింత విస్తరించే ప్రణాళికలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్న పేషెంట్ ట్రయాజ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది వైరల్ వ్యాప్తి సమయంలో రోగి వ్యాధి తీవ్రత, ఆసుపత్రిలో చేరే వ్యవధిని అంచనా వేస్తుంది. భవిష్యత్తు వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సృష్టించబోతోందని, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో కచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
36 పేజీలలో 36 పెళ్లి తంతు వివరాలు ఈ శుభలేఖ వెరీ స్పెషల్
తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

