రేగి పండు మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి.. చివరకు
చిన్న పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తూ అవి గొంతులో ఇరుక్కోవడం..లేదా లోపలికి మింగడం జరుగుతుంటుంది. తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాపాయం తప్పదు. ఖమ్మం జిల్లాలో ఓ పాప ఆడుకుంటూ పెద్ద సైజ్ రేగి కాయను మింగింది.
కామేపల్లి మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన అఫ్సర్, రిజ్వానా దంపతుల 19 నెలల చిన్నారి.. ఆడుకుంటూ పెద్ద సైజులో ఉన్న రేగి కాయ మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పాపను వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ దగ్గరకు తీసుకొచ్చారు. పిల్లలు ఏదైనా వస్తువు మింగితే వాటిని ఆపరేషన్ లేకుండా బయటకు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన ఆ డాక్టర్ .. పాప గొంతులోని రేగి కాయను ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడారు. చావు బతుకుల మధ్య ఉన్న పాపను కాపాడిన డాక్టర్‌కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు ఇవే
పిల్లి గోళ్లు ఇంత ప్రమాదమా..? యువకుడి ప్రాణమే పోయింది.. ఎలాగంటే
వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్ వేస్తారా?
బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో
డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
