రైతు పొలంలో కరెన్సీ గుట్టలు..షాక్‌తో రైతు ఏం చేశాడంటే..
రోజు మాదిరిగానే రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లారు. ఎప్పుడూ లేనిది పొలంలో వారికి ఓ సంచి కనిపించింది. అందులో ఏముందా అని చూసిన రైతులు కళ్లు జిగేల్ మన్నాయి. ఆనందంతో.. గబగబా ఒడినింపుకుని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వాటిని పరిశీలించిన రైతులు షాక్ తిన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తల పాలెంలో నార్కెట్ పల్లి - అద్దంకి రహదారి వెంట ఓ రైతు పొలంలో కరెన్సీ కట్టలు ప్రత్యక్షమయ్యాయి.
ఓ సంచిలో నిండుగా ఉన్న కరెన్సీ కట్టలను ఎవరో అక్కడి వదిలి వెళ్లినట్లు భావించారు. సంచినిండా రూ.500 నోట్లు పేర్చి ఉన్నాయి. పోలీసులకు చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించిన రైతులు అందులోని కొన్ని నోట్ల కట్టలను తీసుకున్నారు. ఎలాగో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులనుంచి కరన్సీ స్వాధీనం చేసుకున్నారు. అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలి ఉన్న ఈ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. ఈ నోట్లను కట్టలు ఎందుకు వినియోగిస్తారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు రూ.20లక్షల విలువగల నకిలీ రూ.500 కట్టలు పంట పొలంలో ప్రత్యక్షమవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగనోట్ల ముఠా పని కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దామరచర్ల మండలంలో దొంగనోట్ల చలామణి జరిగిన ఘటనలు ఉన్నాయి. అదే ముఠా మళ్లీ దొంగ నోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగనోట్ల ముఠాను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేగి పండు మింగిన చిన్నారి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి.. చివరకు
తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు ఇవే
పిల్లి గోళ్లు ఇంత ప్రమాదమా..? యువకుడి ప్రాణమే పోయింది.. ఎలాగంటే
వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్ వేస్తారా?
బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
