Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో

Samatha J

|

Updated on: Mar 03, 2025 | 2:00 PM

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలతో ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులతో శైవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో మణుగూరులో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు శివపార్వతులు కనిపించారంటు పూనకంతో ఊగిపోయాడు. త్వరలో ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు. ఇలాంటి ఘటన ఈ ఆలయంలో ఇది రెండోసారి అంటున్నారు స్థానికులు. అటవీ భూముల ఆక్రమణ కోసం దేవుడు పేరుతో డ్రామాలు చేస్తున్నారంటున్న స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం లో ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహా పీఠం మరో శైవ క్షేత్రం గా వర్డిల్లనుందని, తనకు శివ పార్వతులు కనిపించరంటూ ఓ వ్యక్తి చెప్తున్న మాటలు వైరల్ అవుతున్నాయ్.. ఈ వ్యక్తి వింత ప్రవర్తన ఇప్పుడు మణుగూరులో చర్చనీయాంశంగా మారింది.

మణుగూరు కు తూర్పు దిక్కున ఉన్న రథం గుట్టం వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహా పీఠం వద్ద శివ పార్వతులు తిరుగుతున్నారని, వారిని తాను చూశానని త్వరలో ఈ ప్రాంతం మరో శైవ క్షేత్రం కాబోతుంది అంటూ ఆటో డ్రైవర్ సత్యనారాయణ చెప్పాడు. ఇక్కడ అభివృద్ధి వేగంగా జరగనుందని, వచ్చే భక్తుల వద్ద ఎటువంటి డబ్బులు తీసుకోరాదని, ఈ గుడికి సంబంధించి ఏ అంశంలో నైనా ఇబ్బంది కలిగితే తనను సంప్రదించాలని చెప్పాడు. అతని ప్రవర్తన, మాటలు విన్న స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. గత కొంత కాలంగా మణుగూరు ప్రాంతంలో శివుడి పేరుతో పునకాలు రావడం, తమకు శివ్వయ్య కనిపిస్తున్నాడు అని చెప్పడం ఇది రెండో ఘటన అని, నాలుగు నెలల క్రితం ఇలాగే ఓ బాలుడు కమలాపురం ప్రాంతంలో భూమిలో శివలింగం ఉందంటూ తనను బయటకు తీయాలంటూ మూడు రోజులు హడావుడి చేసి ఊరు నుండి వెళ్ళిపోయాడని స్థానికులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ మరో వ్యక్తి వచ్చి తనకు శివపార్వతులు కనిపిస్తున్నారంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో బాలుడు గాని ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ సత్యనారాయణ గాని చెప్తున్న ప్రదేశాలు అటవీ ప్రాంతానికి సంబంధించినవి కావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల ఆక్రమణ కోసమే ఇలా కొందరు శివుడి పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ స్థానికులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్‌!వీడియో

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో

 గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో

Published on: Mar 03, 2025 01:58 PM