మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో
మనుషులకే కాదు.. ఇక నుంచి మొక్కలకు కూడా ఆధార్ కార్డు లభించనుంది. మొక్కల కోసం “డిజిటల్ ట్రీ ఆధార్”ను ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో పౌరులుగా గుర్తింపుకోసం, ప్రభుత్వ పథకాల లబ్ధిపొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అదే తరహాలో చెట్ల పరిస్థితిపై డేటాబేస్ ను సమీకరించడానికి ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖరా కె మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి.
ముఖరా కె గ్రామంలో ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయించారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మొక్క ఆరోగ్యం, వయస్సు, పెరుగుదల క్రమం, ఆ మొక్క నుంచి ఎంత అక్షిజన్ వస్తుందో తెలుస్తుంది. ఆ వృక్షం ఉన్న నిర్ధిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆ మొక్క లొకేషన్ తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి మొక్క బ్రతుకుంది అంటున్నారు మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి. మనిషికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అలాగే మొక్కలకు కూడా డిజిటల్ ట్రీ ఆధార్ ను ఇస్తున్నామని చెప్పారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయించడం తెలంగాణ లోని తొలి గ్రామంగా ముఖరా కె రికార్డులకు ఎక్కుతుందని గాడ్గే మీనాక్షి అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు నాటిన మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయిస్తే నాటిన ప్రతి మొక్క బతుకుతుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
