అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
మచ్చటపడి ఎంతో అపూరూపంగా టాయిలెట్ కట్టుకుంటే అది కాస్తా దొంగలపాలయింది. ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో ఉన్న బంగారు టాయిలెట్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్యాలెస్‌లో చొరబడిన దొంగలు తమ వద్ద ఉన్న భారీ సుత్తెలతో ఆ టాయిలెట్‌ను పగులగొట్టి దోచుకెళ్లారు. కేవలం అయిదంటే అయిదు నిమిషాల్లోనే అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఆ చోరీ గురించి సోమవారం ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో ప్రాసిక్యూటర్లు వివరించారు.
18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆ టాయిలెట్‌ను అమెరికాగా పిలుచుకుంటున్నారు. దాన్ని ఇటాలియన్ ఆర్టిస్టు మౌరిజియో క్యాటెలన్ తయారు చేశారు. ఆ టాయిలెట్ కుండీ బరువు సుమారు 98 కేజీలు ఉంటుంది. దాన్ని సుమారు ఆరు మిలియన్ల డాలర్లకు బీమా చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ కోర్టుకు లాయర్లు తెలిపారు.టాయిలెట్ కుండీని దోచికెళ్లిన సమయంలో.. దానిపై ఉన్న బంగారం విలువ అప్పట్లోనే సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2019 సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి జరిగిన చోరీలో తన పాత్ర లేదని ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన 39 ఏళ్ల మైఖేల్ జోన్స్ కోర్టుకు తెలిపారు. 36 ఏళ్ల ఫ్రెడ్రిక్ సైన్స్, 41 ఏళ్ల బోరా గుకుక్‌లు కూడా కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. బంగారు టాయిలెట్‌ను పగులగొట్టిన తర్వాత.. సుత్తెలను అక్కడే విడిచివెళ్లినట్లు కోర్టుకు తెలిపారు.గోల్డెన్ టాయిలెట్‌ను ఎత్తుకెళ్లిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసి.. ఆ బంగాన్ని అమ్మేందుకు దొంగలు ప్రయత్నించారు. హటన్ గార్డెన్ జువెలరీ షాపుతో ఆ దొంగలు లింక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చాలా జాగ్రత్తగా దొంగతనం చేసినట్లు ప్రాసిక్యూటర్ జులియన్ క్రిస్టోఫర్ తెలిపారు. చోరీ చేసిన వాహనాల్లో వచ్చిన అయిదుగురు.. చెక్క గేట్లను పగులగొట్టి, ప్యాలెస్‌లోకి ప్రవేశించారు. టాయిలెట్ ఎక్కడుందో తెలిసిన ఆ దొంగలు.. అక్కడ డోర్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత టాయిలెట్‌ను తీసివేసి, 5 నిమిషాల్లో అక్కడ నుంచి పరారీ అయినట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రధాని మోదీ తీసుకునే సూపర్ ఫుడ్ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!
చివరి అమృత్‌స్నాన్.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!
ఫంక్షన్ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
