ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో
అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతున్న ఓ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల హెచ్చరించింది. 2024 డిసెంబర్ 27న ఈ గ్రహశకలాన్ని చిలీ పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలం వేగంగా భూమివైపు దూసుకొస్తోందని తెలిపారు. ఫిబ్రవరి 18న నాసా జరిపిన పరిశోధనలో 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు 3.1 శాతం అవకాశం ఉందని తేలింది. దీంతో ఈ గ్రహశకలాన్ని లెవెల్ -3 శకలంగా నాసా ప్రకటించింది. అయితే, ఈ గ్రహశకలంతో ఎలాంటి ముప్పు లేదని ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్ధారించింది.
ఫిబ్రవరి 19న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 1.5 శాతంగా తేలిందని, ఫిబ్రవరి 24న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 0.002 శాతానికి తగ్గిందని నాసా కూడా వెల్లడించింది. దీంతో ఈ గ్రహశకలంతో భూమికి ముప్పు లేదని తేల్చి, హెచ్చరికలను ఉపసంహరించుకుంది. అయితే, ఈ గ్రహశకలంపై నిఘా కొనసాగిస్తామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పరిమాణం, లోపలి మూలకాల వివరాల గురించి పరిశోధన జరుపుతామని చెప్పారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుతో ఈ గ్రహశకలాన్ని మార్చి, మే నెలల్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. 2024 వైఆర్ 4 వ్యాసం సుమారు 50 మీటర్లు ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల ఈ గ్రహశకలం కొన్నాళ్లపాటు కనిపించదని, 2028 జూన్ లో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో
డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో
ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో
నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్ ట్విస్ట్..వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
