Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

Samatha J

|

Updated on: Feb 28, 2025 | 2:37 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి చెప్పారు. సోమవారం బీహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించిన మోదీ తన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా మఖానా సూపర్ ఫుడ్ అని అన్నారు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని పేర్కొన్నారు. తాను 365 రోజుల్లో 300 రోజులు మఖానాను అహారంలో భాగంగా చేసుకుంటానని చెప్పారు. దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు అల్పాహారంగా మఖానాను తీసుకుంటున్నారన్నారు. అందుకు అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం బీహార్‌లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మఖానా బోర్డు ప్రకటించినందుకు కృతజ్ఞతగా, సభలో ప్రధాని మోదీని మఖానాతో తయారు చేసిన దండతో సత్కరించారు. ఈ మఖానా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. వీటిలో మైక్రో న్యూట్రియెంట్లు , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. టైప్‌-2 మధుమేహాన్ని అడ్డుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్‌ చేస్తాయి.

 పూల్‌ మఖానాలో ఉండే పైబర్‌ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరిచి, మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. అంతేకాదు పూల్ మఖానాలో యాంటీ ఏజింగ్‌ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే అమినో యాసిడ్స్‌ చర్మంపై వచ్చే ముడుతల్ని, మొటిమల్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు ఇది మంచి పోషకాహారంగా నిపుణులు చెబుతారు. పిల్లలకు నచ్చేలా దీంతో చాట్‌ మిక్చర్‌ కూడా చేసిపెట్టొచ్చు. 100 గ్రాముల మఖానా తింటే శరీరానికి 340 గ్రాముల కేలరీలు అందుతాయి. వీటిలో ఫ్యాట్స్‌ శాతం అసలు ఉండదు, కనుక బరువు పెరుగుతారనే భయంలేదు. రోజులో 30 గ్రాముల వరకూ మఖానా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లను బ్యాలెన్స్‌ చేస్తాయి. దీంతో భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది. వీటిలో రక్తాన్ని శుద్ధిచేసే డిటాక్సిఫైయింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాల్ని బయటకు పంపుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యలను తగ్గిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం :

బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో

నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్..వీడియో