Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ డాక్టర్‌ పైశాచికం.. 299 మందిపై అత్యాచారం..పిల్లల్ని వదల్లేదుగా వీడియో

మాజీ డాక్టర్‌ పైశాచికం.. 299 మందిపై అత్యాచారం..పిల్లల్ని వదల్లేదుగా వీడియో

Samatha J

|

Updated on: Feb 28, 2025 | 2:36 PM

వైద్యులను దేవుడితో సమానంగా చూస్తారు. డాక్టర్లు రోగులకు చెప్పే ధైర్యంతోనే సగం రోగం నయమవుతుంది. అందుకే డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతారు. అంతటి పవిత్రమైన వైద్యవృత్తికే కళంకం తెస్తుంటారు. విచక్షణమరిచి ప్రవర్తిస్తారు. అలా ఓ వైద్యుడు పైశాచికంగా మారి, తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయాల్సింది పోయి వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. అలా మూడు దశాబ్దాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం మరింత బాధాకరం. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల జోయెల్‌ లి స్కౌర్నెక్‌పై విచారణ చేపట్టారు. ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయెల్‌ ఓ ఆసుపత్రిలో సర్జన్‌ గా పని చేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై అతడు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే, అతడి అకృత్యాలు బయటపడింది మాత్రం 2017లో. తన పొరుగింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయెల్‌పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో 3 లక్షలకు పైగా ఫొటోలు బయటపడ్డాయి. 650కి పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు.

నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు అతడి డైరీల్లో చూసి అధికారులు షాకయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయెల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. అతడి పాపాల చిట్టా బయటపడింది. అయితే, బాధితుల్లో చాలామందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం గమనార్హం. జోయెల్‌ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా.. తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసి కూడా అలా ప్రవర్తించానని, తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నాననిజోయెల్‌ తెలిపాడు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న కోర్టు ఇతనికి ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో

నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్..వీడియో