ముగింపు దశకు మహా కుంభమేళా.. ఏకంగా 15 వేల మందితో..వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి రోజును ముగుస్తోంది. ఓ వైపు 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా... మరోవైపు శివరాత్రి పర్వదినం వెరసి ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈనేపథ్యంలోనే గిన్నిస్ రికార్డు లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్‌ను నిర్వహించారు. దాదాపు 15 వేల మంది కార్మికులు చీపురు పట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో
డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో
ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో
నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్ ట్విస్ట్..వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
