Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

Samatha J

|

Updated on: Feb 28, 2025 | 2:24 PM

అది పంజాబ్‌ రాష్ట్రం ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని కరీ కలాన్‌ గ్రామం. ఆ గ్రామ పరిసరాలు పచ్చగా అలరారుతూ ఉంటాయి. గత బుధవారం కరీ కలాన్‌ గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉన్నట్టుండి టెంట్లు వెళిశాయి. వాటికి రంగురంగుల లైటింగ్స్ వెలుగులు తోడయ్యాయి. పచ్చని పొలాల్లో బంధుమిత్రుల సమక్షంలో దుర్లభ్‌ సింగ్ , హర్మన్‌ కౌర్‌ జంట ఒక్కటైందిఈ రోజుల్లో పెళ్లి అంటే పెద్ద హంగామా..! భారీ ఫంక్షన్‌ హాల్‌ , అదిరిపోయే డెకరేషన్ ‌, వందల వెరైటీల్లో వంటకాలు ఉంటాయి. కానీ విదేశాల్లో ఉంటున్న ఈ పంజాబీ జంట మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఆర్భాటాలు ఏవీ లేకుండా పంట పొలాల్లో పెళ్లి చేసుకుంది.

ఢిల్లీ సరహద్దుల్లో ఎన్నో ప్రయాసలకు ఓర్చి రైతులు చేసిన ఆందోళనలే తాము పంట పొలాల్లో పెళ్లి చేసుకోవడానికి కారణమని ఆ జంట తెలిపింది. అంతకుముందు వధువు హర్మన్‌ కౌర్‌ భారీ ఊరేగింపుతో వరుడు దుర్లభ్‌ ఇంటికి చేరింది. తర్వాత అక్కడి నుంచి ఊరి బయట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి వచ్చింది. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. పెళ్లిమండపాన్ని రకరకాల మొక్కలతో అలంకరించారు. పెళ్లి అనంతరం వాటిని చుట్టాలకు పంచారు. అదేవిధంగా రైతుల నినాదాలు ముద్రించిన స్వీట్‌ బాక్సులను పంచిపెట్టారు. రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందజేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైతుల ఆందోళనలను ఆదర్శంగా తీసుకుని పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న యువ జంటన అభినందిస్తున్నారు. దుర్లబ్‌ సింగ్‌, హర్మన్‌ కౌర్‌లు ప్రస్తుతం కెనడాలో సాఫ్టవేర్‌ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో

నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్..వీడియో