సార్ టిప్ టాప్‌గా విగ్‌తో ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు.. తేడా అనిపించి.. చెక్ చేయగా…
మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్టవిప్పిచూడు పురుగులుండు అన్నట్లు.. పైకి కోటు వేసుకొని టిప్‌టాప్‌గా కనిపించేవారంతా జెంటిల్మెన్ అనుకుంటే పొరపాటేనండోయ్. ఆ కోటు వెనక కొకైన్ ఉండొచ్చు..గంజాయి ఉండొచ్చు...ఇంకేమైనా ఉండొచ్చు.. కొలంబియాలోని ఓ ఎయిర్‌పోర్టులో టిప్‌టాప్‌గా నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని చూసి, అనుమానించిన అక్కడి అధికారులు.. అతడిని ఆపి చెక్‌చేశారు. ఏమీ కనిపించలేదు. వెరైటీగా..స్టైల్‌గా ఉన్న అతని విగ్‌పైన అధికారుల దృష్టిపడింది.. అందులోనే అసలు యవ్వారం బయటపడింది..అదేంటో తెలుసుకుందాం పదండి.
కొలంబియాలోని కార్టజేనాలోని రాఫెల్ నునెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40 ఏళ్ల కొలంబియన్ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను పెట్టుకున్న హెయిర్ విగ్ లోపల కొకైన్‌ను దాచి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించాడు. ఆమ్‌స్టర్‌డామ్‌కు విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న పెరీరాకు చెందిన ఆ వ్యక్తి విగ్‌లో 220 గ్రాముల (7.76 ఔన్సులు) కంటే ఎక్కువ కొకైన్ ఉందని పోలీసులు కనుగొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో స్కాన్ చేస్తుండగా.. అతని విగ్ అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో కాస్త పరీక్ష పెట్టగా.. లోపల డ్రగ్స్ ఉన్నట్లు కనుగొన్నారు. బాడీ స్కాన్ నుండి తీసిన ఫుటేజ్‌లో భారీ మొత్తంలో కొకైన్ ఉన్నట్లు వెల్లడైంది. బిబిసి ప్రకారం , 10 లక్షల విలువైన ఆ డ్రగ్స్‌ను 400 డోసులుగా విభజించినట్లు గుర్తించారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం , కొలంబియా ప్రపంచంలో కొకైన్ ఎగుమతి చేసే దేశాల్లో టాప్ ప్లేసులో ఉంది. 2023 లో ఆ దేశం కోకా ఆకు సాగు, ఉత్పత్తి విషయంలో కొత్త రికార్డును సృష్టించింది.
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

