వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్ వేస్తారా?
ఒకప్పుడు టూర్‌కి వెళ్లడం అంటే ఫ్యామిలీ స్నేహితుల గ్యాంగ్ తో కలిసి ఆహ్లాదం కలిగించే ప్రాంతాలకు వెళ్లొచ్చేవారు. కొందరు పుణ్యక్షేత్రాలకు వెళితే మరికొందరు అడ్వెంచర్ ను ఎంజాయ్ చేసేవారు. ట్రెండ్ మారుతోంది. ఇవన్నీ కాదు.. ఇంకేదైనా కొత్తగా కావాలంటోంది యువత. వీరి ఆసక్తులకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిని మెల్లిగా తనవైపు తిప్పుకుంటోంది డార్క్ టూరిజం.
కొందరు థ్రిల్లింగ్ అనుభూతి కోసం మరికొందరు తమ భయాలను అధిగమించడం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. డార్క్ టూరిజాన్నే పారానార్మల్ టూరిజం అని కూడా పిలుస్తున్నారు. ఈ టూర్ ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశాల పేరు చెప్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తలుచుకుంటేనే గుండె దడ మొదలవుతుంది. మామూలుగా అటువైపు వెళ్లడానికి కూడా సాధారణ ప్రజలు జంకుతుంటారు. కొందరు ఔత్సాహికులు మాత్రం ట్రిప్పులకు వెళ్లడానికి ఇవే సరైన ప్రదేశాలంటున్నారు. వీరి పుణ్యమా అని ఒకప్పుడు దెయ్యాల కొట్టాలుగా పేరున్న భవంతులు, ప్రదేశాలన్నీ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. పేరులో ఉన్నట్టుగానే దెయ్యాలు, ఆత్మలను అన్వేషించుకుంటూ వెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎప్పటినుంచో అక్కడ ఆత్మలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంటుంది. లేదా మరేదైనా మిస్టీరియస్ ప్లేస్ అయ్యుంటుంది. అలాంటి ప్రాంతాలను వెతికి మరీ ఒక గ్రూపుగా కలిసి వెళ్లి వస్తుంటారు. ఇది వీరికి థ్రిల్లింగ్ కలిగించేలా ఉంటుందట. ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాంతాలున్నాయో ముందే తెలుసుకుంటారు. ఇక అక్కడకు వెళ్లి వెన్నులో వణుకు పుట్టేలా భయపడిపోతుంటారు. మరికొందరు ఆత్మలున్నాయా లేదా అనే విషయంపై తమ కుతూహలం తీర్చుకుంటారు. వీటిని సైంటిఫిక్ విధానంలో అర్థం చేసుకోవడానికి కూడా ఈ కల్చర్ ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో
డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు
డాక్టర్ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?
36 పేజీలలో 36 పెళ్లి తంతు వివరాలు ఈ శుభలేఖ వెరీ స్పెషల్
తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
