పిల్లి గోళ్లు ఇంత ప్రమాదమా..? యువకుడి ప్రాణమే పోయింది.. ఎలాగంటే
చాలా మందికి కుక్కలు, పిల్లులు పెంచుకోవడం ఇష్టం. పెంపుడు జంతువును పెంచుకుంటున్న వారు ఎప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. చాలా సార్లు కుక్కలు లేదా పిల్లులు మనల్ని గోళ్లతో రక్కుతాయి. దీన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో ఒక యువకుడు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయాడు. పిల్లి ఆ యువకుడి గోళ్లతో రక్కింది. కానీ ఆ యువకుడు దానిని సీరియస్‌గా తీసుకోలేదు.
తరువాత అతని ఆరోగ్యం క్షీణించి మరణించాడు. మధ్యప్రదేశ్ షాహ్‌డోల్ జిల్లా అమలై పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 22 ఏళ్ల దీపక్ కోల్ ను చికిత్స కోసం SECL సెంట్రల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స సమయంలో, దీపక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అతన్ని షాడోల్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు. దీపక్ మరణించాడు. దీపక్ మరణానికి గల కారణాల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టారు. దీపక్ కుటుంబం ప్రకారం, అతని ఇంటికి తరచుగా ఒక పిల్లి వచ్చేది. ఒకరోజు ఆ పిల్లి దీపక్ పై దాడి చేసి అతని గోళ్లతో రక్కింది. పిల్లి గోళ్ల వల్ల దీపక్ గాయపడ్డాడు. కానీ అతడు గాయాన్ని పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత దీపక్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. పిల్లి గోళ్లతో రక్కడం కారణంగానే అతను చనిపోయాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీకెండ్‌లో “ఆత్మల” వేట దెయ్యాల కోటకి టూర్ వేస్తారా?
బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు…ఆస్పత్రికి తీసుకెళ్లగా… ఎక్స్‌రేలో
డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు
డాక్టర్ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

