ఏఐ బాట్‌ల మధ్య షాకింగ్ సంభాషణ.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
ప్రస్తుత కాలంలో మనుషులు చేయాల్సిన చాలా పనులు మెషిన్లు చేసేస్తున్నాయి. దీంతో మనుషులకు పనులు తగ్గిపోయాయి. ఈ ప్రభావం ఏకంగా ఉద్యోగాలు ఊడిపోయేవరకూ వెళ్లింది. ఈ సంగతి పక్కన పెడితే.. యూకేలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. తన యజమాని తరఫున హోటల్ బుకింగ్ కోసం ఫోన్ చేసిన ఓ ఏఐ బాట్ కు హోటల్ లోని ఏఐ అసిస్టెంట్ హలో చెప్పింది.
తాను మాట్లాడుతున్నది మరో ఏఐ అసిస్టెంట్ అని తెలియగానే తమకు తామే భాష మార్చేసి మెషిన్ లాంగ్వేజ్ లో మాట్లాడేసుకున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సదరు యజమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే సీన్ ను చూసి నివ్వెరపోయామని కామెంట్లు పెడుతున్నారు. యూకేకు చెందిన ఓ వ్యక్తి వివాహం చేసుకోవడానికి హోటల్ బుక్ చేయమని తన ఏఐ అసిస్టెంట్ ను ఆదేశించాడు. సదరు ఏఐ అసిస్టెంట్ తనకు తానుగా లియోనార్డో హోటల్ కు ఫోన్ చేసింది. హోటల్ కు సంబంధించిన ఏఐ అసిస్టెంట్ ఈ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకుని, లియోనార్డో హోటల్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏవిధంగా సహాయపడగలను? అని అడిగింది. వెంటనే ఏఐ అసిస్టెంట్ .. హాయ్…నేను ఏఐ ఏజంట్ ను.. బోరిస్ స్టార్కోవ్ తరపున మాట్లాడుతున్నాను. ఆయన తన వివాహం కోసం మంచి హోటల్ ను వెతుకుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలిలో ప్రభాస్ లాగా శివలింగాన్ని పెకిలించేశారు
Samantha: రష్మికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన సమంత
100 మంది చిన్నారులకు బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…
Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
