Samantha: రష్మికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన సమంత
గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది సమంత. ఎక్కువగా వెబ్ సిరీస్ లపైనే ఆసక్తి చూపిస్తోంది. గతేడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లోనూ సామ్ నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే బిజినెస్ లోనూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది సామ్.
సాకీ పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం అలాగే ఏకం లెర్నింగ్ స్కూల్ అంటూ బిజి బిజీగా ఉంటోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను తోటి నటీనటులకు పంపిస్తుంటారు. విజయ్ దేవరకొండ, నయన తార తదితర సెలబ్రిటీలు కూడా తమ బిజినెస్ ప్రొడక్ట్స్ ను ఇతర హీరోలు, హీరోయిన్లకు పంపిస్తుంటారు. దీని వల్ల ఆయా సెలబ్రిటీల బిజినెస్ ప్రొడక్ట్స్ కు కావాల్సిన ప్రమోషన్ కూడా లభిస్తుంటుంది. అలా తాజాగా సమంత తన సాకీ బ్రాండ్ దుస్తులను రష్మికకి పంపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది నేషనల్ క్రష్. తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఛావాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉంటోంది. ఇది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోందీ అందాల తార.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 మంది చిన్నారులకు బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…
Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
