ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా?
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాల ద్వారా పౌరాణిక కథల పాత్రలను కొత్త తరహాలో ఆడియెన్స్ కు చెబుతున్నారు. కొత్త తరాన్ని ఆకర్షించే సూపర్ హీరో పాత్రలుగా దేవుళ్లను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాతో ఇలాగే విజయం సాధించాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టి నటిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పుడు ప్రభాస్ తో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకున్న ప్రశాంత్ వర్మ, పౌరాణిక కథతోనే సూపర్ హీరో తరహా సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే ‘బాహుబలి’, ‘కల్కి 2898 AD’ సినిమాల్లో సూపర్ హీరో లాంటి పాత్రలు పోషించాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ పూర్తి స్థాయి సూపర్ హీరో పాత్రను పోషించనున్నాడు. అది కూడా హాలీవుడ్ సూపర్ హీరోల కంటే భిన్నమైన సూపర్ హీరో పాత్రను డార్లింగ్ పోషించనున్నాడని సమాచారం. ఇటీవల ట్విట్టర్‌లో.. ప్రశాంత్ వర్మ, తాను ఒక పెద్ద నటుడితో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, వీలైనంత త్వరగా ప్రకటన చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం కొత్త సినిమా చేస్తున్నాడని, త్వరలోనే ఆ సినిమా గురించి ప్రకటన చేస్తారని సమాచారం. ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తుందని చెబుతున్నారు. హోంబాలే మొత్తం మూడు చిత్రాలకు ప్రభాస్‌తో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. ‘సలార్ 2’ తర్వాత ప్రభాస్ మరో రెండు సినిమాలకు సంతకం చేశాడు. వాటిలో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే చిత్రం కూడా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవిత్ర స్నానం చేస్తుంటే.. ఇలా వీడియోలు తీయడం ఏంటి?
ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!
90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
