Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!
విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలై 16 రోజులు అయింది. ఈ 16 రోజుల్లో ‘ఛవా’ ఎంత వసూళ్లు రాబట్టింది? సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి?
‘ఛవా’ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొట్టిందో ఈ వీడియో చూద్దాం..! ‘ఛావా’ చిత్రం 16వ రోజు అంటే శనివారం మార్చి 02న 25 కోట్లు వసూలు చేసింది. దీంతో 16వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక మొత్తంగా 500 కోట్లకు దగ్గర్లో ఈ మూవీ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఛావా సినిమా పాన్ ఇండియా సినిమా కానప్పటికీ… హిందీలో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ… ఈ మూవీ ఈ రేంజ్లో కలెక్షన్స్‌ను కొల్లగొట్టడం ఇప్పుడు అంతటా హాట్ టాక్ అవుతోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఆయన భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక మందన్న అద్బుతంగా నటించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేంకర్, ప్రదీప్ రావత్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా?
పవిత్ర స్నానం చేస్తుంటే.. ఇలా వీడియోలు తీయడం ఏంటి?
ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!
90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
