పవిత్ర స్నానం చేస్తుంటే.. ఇలా వీడియోలు తీయడం ఏంటి?
కొన్ని రోజుల క్రితం హీరోయిన్ కత్రినా కైఫ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్నారు. తన అత్తగారితో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. అయితే కత్రీనా తన కుటుంబసభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తుండగా.. అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆమె అనుమతి లేకుండా కత్రినా వీడియోలను రికార్డ్ చేశారు.
తడిచిన బట్టల్లో ఆమెను క్యాప్చర్ చేసి.. నెట్టింట అప్లోడ్ చేశారు. అసభ్యకర థంబ్ నెయిల్స్ పెట్టారు. అయితే ఇలాంటి వీడియోలపై బాలీవుడ్ సీనియర్ హీరయిన్ రవీనా టాండన్ సీరియస్ అయ్యారు. ఇది చాలా దారుణం అంటూ విమర్శలు గుప్పించారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు తమను తాము రికార్డ్ చేసుకుంటూ.. పక్కనే ఉన్న కత్రినా కైఫ్ వైపు తిప్పారు. ‘ఇది నేను, ఇది నా తమ్ముడు.. మా పక్కనే కత్రీనా కైఫ్’ అంటూ ఆమెను చూపించారు. ఆ సమయంలో చుట్టుపక్కన ఉన్నవాళ్లు నవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ మండిపడ్డారు. మహాకుంభమేళా వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!
90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

