అక్బర్ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో
శివుడు.. నిర్వికారుడు.. నిరంజనుడు.. దయామయుడు.. కరుణించి వరాలిచ్చే బోళా శంకరుడు.. మనం లింగరూపంలో అర్చిస్తాం. సాధారణంగా గుళ్లలో చుట్టూ పానవట్టంతో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే, ఇందుకు భిన్నంగా నేలకు సమాంతరంగా… అంటే అడ్డంగా ఉండే శివలింగం పంజాబ్ రాష్ట్రం కలానౌర్‌లో ఉంది. కాశీ అంతటి విశిష్టత కలిగిన క్షేత్రంగా పరిఢవిల్లుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి శివుడి ఆశీస్సులు పొందుతుంటారు.
కలానౌర్ ప్రాంతం మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజ్యంలో ఉండేది. ఆయన మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకొన్నది కూడా ఇక్కడే. 1556లో ఒకసారి ప్రస్తుతం శివలింగం వెలసిన స్థలం మీదుగా వెళ్లిన గుర్రాలు నడవలేకపోయాయట. అప్పటిదాకా బాగున్నవి ఉన్నట్టుండి ఎందుకు కుంటుతున్నాయో సైనికులకు అర్థం కాలేదు. అక్బర్ కూడా తన గుర్రంతో వచ్చాడు. రాజు గుర్రం కూడా ఈ చోటుకు రాగానే కదలలేని స్థితికి చేరుకుంది. దీంతో అక్కడ ఏముందో చూడమంటూ తవ్వకాలకు ఆదేశించాడు. ఆ రాత్రి అక్బర్ కలలో ఒక దివ్యవాణి వినిపించిందట. ఇక్కడ శివుడు వెలిసి ఉన్నాడనీ, తవ్వకాలు ఆపేసి, ఇదే ప్రాంతంలో గుడి నిర్మించమని ఆదేశించిందట. దీంతో అక్బర్ ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశాడని స్థానికులు చెబుతారు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్!వీడియో
పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం
మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో
గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
