బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో
ఎన్నిచట్టాలు చేసినా... ఎన్నిశిక్షలు అమలు చేసినా కామాంధులు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నారు. ఆడపిల్ల ఒంటిరిగా కనిపిస్తేచాలు కామంతో రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. అక్కా అంటూ ఆమెతో మాటలు కలిపాడు. ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర పూణెలోని అతిపెద్ద బస్టాండ్‌లలో ఒకటైన స్వర్‌గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం జరిగింది. బస్టాండ్‌కు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి సతారా జిల్లాలోని తన స్వగ్రామం ఫల్టాన్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు అక్కా అని పిలుస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ వివరాలు తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్‌లో దూరంగా నిలిపి ఉంచిన బస్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బస్సు ఎక్కాలని చెప్పగా, బస్సులో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో అనుమానించిన ఆమె బస్సు ఎక్కేందుకు నిరాకరించింది. నిందితుడు బస్సులో ప్రయాణికులు అంతా నిద్ర పోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తనూ ఎక్కి తలుపు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన ఊరు వెళ్లాల్సిన బస్సు ఎక్కింది. అదే బస్సులో తన స్నేహితురాలిని చూసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పడంతో వెంటనే బస్సు దిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్!వీడియో
పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం
మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో
గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
