Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

Samatha J

|

Updated on: Mar 03, 2025 | 8:31 PM

ఐడియా ఉండాలే కానీ.. అడుక్కుతినేవాడు కూడా అపరకోటీశ్వరుడైపోతాడు.. పేదప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని మరో పేదవాడు చేసిన మోసం ఇది. తాపీ పనికోసం రోజుకూలీగా హైదరాబాద్‌ వచ్చాడు.. అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. అనతికాలంలోనే అందరికి నమ్మకంగా మారాడు. సమయం చూసి మరో దందా మొదలుపెట్టాడు.. అదే చిట్టీల వ్యాపారం. అధిక వడ్డీ ఆశచూపాడు.. వందలాదిమందితో చిట్టీలు కట్టించాడు. యవ్వారం మామూలుగా లేదు.. డబ్బులే డబ్బులు.. వేలు.. లక్షలు పోయ్యాయి.. ఇక కోట్లే కోట్లు.. డబ్బే డబ్బు అంటూ అతని తీరు సాగింది.. ఈ క్రమంలోనే మొత్తం పోగేసుకోవాలన్న ఆశ పుట్టింది.. కట్ చేస్తే.. రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు.. ఆ తాపీ మేస్త్రీ .. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులవద్దకు పరుగులు తీశారు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో చోటుచేసుకుంది..

వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య తాపీ పని చేస్తూ హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.. రెండు దశాబ్దాలుగా ఎస్‌ఆర్‌ నగర్‌లో నివాసం ఉంటూ.. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.. స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో చిట్టీ ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో అధిక వడ్డీ పేరుతో దాదాపు 300కుపైగా ఖాతాదారులను జమచేశాడు.. వారి నుంచి దాదాపు రూ.70 కోట్లను వసూలు చేశాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పుల్లయ్య బాధితులు అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, బల్కంపేట ప్రాంతాలకే పరిమితం కాలేదని.. అతని స్వస్థలమైన అనంతపురం జిల్లాలోని గుత్తి, కర్నూల్ జిల్లాలో కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో తాము దాచుకున్న నగదుతోపాటు తమకు తెలిసిన వారి నగదును కూడా పుల్లయ్య దగ్గర డిపాజిట్లు చేయించామని.. బాధితులు లబోదిబోమన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్‌!వీడియో

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో

 గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో

Published on: Mar 03, 2025 08:30 PM