ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు చెప్పులు ఆలయం బయట వదిలి వెళ్తారు. దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చేవరకూ ఆ చెప్పులు అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పులు అలాగే పోతుంటాయి. ఆలయాలవద్ద చెప్పులు పోవడం సహజం. అయితే ఓ భక్తుడు అలా ఎన్నిసార్లు పోగొట్టుకున్నాడో ఏమోకానీ తన చెప్పులు ఆలయం బయట వదిలి లోపలికి వెళ్తూ తన చెప్పులు ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఓ ప్లాన్ వేశాడు. తన చెప్పులకి లాక్ వేసి వెళ్లాడు. రద్దీగా ఉన్న ఓ ఆలయ ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తి.. తన చెప్పులు చోరీ కాకుండా కాపాడుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడికి ఓ ఐడియా వచ్చింది. అలా ఆ వ్యక్తి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకోవడానికి కొందరు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుంటే. కొందరు సెక్యూరిటీని పెట్టుకుంటారు. కొందరైతే తమ ఇళ్లలోకి దొంగలు చొరబడకుండా ప్రహరీ గోడలకు గాజుపెంకులు పెట్టించండం, చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం చేస్తారు. ఇక కార్లు, బైకులు బయట పార్క్ చేసినప్పుడు వాటి చక్రాలకు గొలుసు కట్టడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోన చూసిన నెటిజన్లు.. ‘‘ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే కష్టమే అంటున్నారు. ఇంతకీ అతను ఏంచేశాడంటే.. చెప్పులు వదిలిన తర్వాత వాటికి ఓ పెద్ద తాళం కప్పతో తాళం వేశాడు. ఆ చెప్పులు ఎవరైనా ఎత్తుకెళ్లాలంటే తాళం తీస్తే తప్ప వేసుకోడానికి రావు..అలా దొంగలకి షాకిచ్చాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చెప్పులు ఎత్తుకెళ్తే తాళం ఫ్రీ అన్నట్టు బంపరాఫర్ ఇచ్చాడుగా అని కొందరు.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్లతో లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..
బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో
అక్బర్ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో
ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
