Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో

అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో

Samatha J

|

Updated on: Mar 04, 2025 | 8:51 PM

రోజుకో కొత్త ఎత్తుగడతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల విగ్గులో డ్రగ్స్‌ పెట్టి స్మగ్లింగ్‌ చేస్తూ ఓవ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు కొందరు ఖర్జూర పండ్లలో గోల్డ్‌ పెట్టి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. కవిత్వానికి కాదేదీ అనర్హం అని కవులంటే.. స్మగ్లింగ్‌కు వీలుకాని సరుకే లేదంటున్నారు కేటుగాళ్లు. ఎక్కడికక్కడ కస్టమ్స్‌ అధికారులు స్మగ్లర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూనే ఉన్నారు ఈ అక్రమార్కులు.

 తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా త‌ర‌లిస్తున్న ఓ వ్యక్తిని క‌స్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. అత‌ని వ‌ద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ప్రకారం.. ఎస్వీ-756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి వ‌చ్చిన 56 ఏళ్ల వ‌య‌సున్న ఒక ప్రయాణికుడిపై అనుమానంతో క‌స్టమ్స్‌ అధికారులు త‌నిఖీ చేశారు. బ్యాగేజీ చెకింగ్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీపై వారికి అనుమానం వ‌చ్చింది. అత‌ని వ‌ద్ద ఉన్న ఖ‌ర్జూర పండ్ల మూట‌ను ఓపెన్ చేసి ప‌రిశీలించారు. ఆ పండ్లలో గింజల ప్లేస్‌లో బంగారు ముక్కల‌ను అమ‌ర్చిన‌ట్లు గుర్తించారు. ఆ ఖ‌ర్జూర పండ్ల బ్యాగ్‌లో ఒక బంగారు చైన్ ను కూడా అధికారులు గుర్తించారు. ఖ‌ర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స‌ద‌రు వ్యక్తిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో

అక్బర్‌ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో