Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో

అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో

Samatha J

|

Updated on: Mar 04, 2025 | 8:49 PM

నీలమ్ షిండె అనే విద్యార్థిని అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఐసీయూలో ఉన్న కుమార్తె దగ్గరికి వెళ్లేందుకు మహారాష్ట్రలోని ఆమె తండ్రి ప్రయత్నిస్తున్నారు. ఆయన అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆయనకు సహాయం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, భారత దౌత్య కార్యాలయాన్ని ఎంపీ సుప్రియా సూలే ఎక్స్ వేదికగా కోరారు. అమెరికాలో ఐసీయూలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యార్థిని దగ్గరకు ఆమె కుటుంబం వెళ్లేందుకు కేంద్రం సహకరిస్తోంది. దానిలో భాగంగా అమెరికా నుంచి కూడా స్పందన వచ్చింది.

కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబానికి సహాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధితురాలి తండ్రి ఆవేదన తమ దృష్టికి రావడంతో అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. అత్యవసర ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ భారత విదేశాంగశాఖకు చెందిన అమెరికా విభాగం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీజీ చేస్తోన్న నీలమ్ షిండె ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు ఢీకొనడంతో షిండె తల, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంటున్న ఆమె కుటుంబానికి ఫిబ్రవరి 16న ఈ విషయం తెలిసింది. నీలమ్ తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆ కుటుంబం ఆవేదన అందరి దృష్టికి చేరింది.

మరిన్ని వీడియోల కోసం :

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో

అక్బర్‌ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో