గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…
ఎవరికి, ఎప్పుడు, ఎటునుంచి, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది. గంగానదిలో దాదాపు వంద మంది యాత్రికులు చిక్కుకుపోయిన ఘటన రిషికేశ్‌లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా గాంగానది ప్రవాహం ఉదృతి పెరగడంతో యాత్రికులు నదిలోనే చిక్కుపోయారు. జానకిజూలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అయితే నదిలో చిక్కుకున్న యాత్రికులను సకాలంలో పోలీసులు రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పనట్లయింది. యాత్రికులంతా హర్యానాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.గంగానదిలో వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో పుణ్యస్నానం చేయడానికి నదిలోని ఓ ద్వీపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నదిలో వరద ప్రవాహం పెరగడం గమనించారు. ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు గ్రహించి, సహాయం కోసం అరవడం ప్రారంభించారు. వారి కేకలు విన్న జానకీ ఘాట్ సమీపంలోని పోలీసులు, జలమండలి సిబ్బంది చిక్కుకుపోయిన భక్తులను రక్షించారు. తమ ప్రాణాలను కాపాడిన జలమండలి సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో
అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో
ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
