హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్.. ఏం చేసిందో చూడండి
కోతుల అల్లరి గురించి అందరికీ తెలిసిందే. గుడికి, ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు కోతులు తప్పక కనిపిస్తాయి. కనిపించడమే కాదు. వాటిని దాటుకొని వెళ్లడం పెద్ద సవాలే. ఎవరి చేతిలోనైనా ఏదైనా కనిపించిందా.. వెంటనే లాక్కెళ్లిపోతాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూసుంటాం.
తాజాగా ఓ రిసార్ట్ లాంటి ప్రాంతంలో ఓపెన్ ఏరియాలో హల్దీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. పక్కనే అటవీప్రాంతంలాంటిది ఉంది. అక్కడ చాలా కోతులు ఉన్నాయి. ఇక్కడ హల్దీ ఫంక్షన్ స్టార్టయింది. అంతే ఒక్కసారిగా ఆ ఫంక్షన్‌లోకి ఓ కోతి దూసుకొచ్చింది. ఇక అది చేసిన అల్లరికి అంతా అవాక్కయి చూస్తుండిపోయారు. హల్దీ పంక్షన్‌లో వధూవరులు సోఫాలలో కూర్చుని ఉన్నారు. మిగతావారంతా చుట్టూ చేరి ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉ న్నారు. వారిలో ఓ యువతి ఓ పళ్లెంలో స్వీట్స్ పట్టుకుని అక్కడ నిలబడి ఉంది. ఎక్కడినుంచి చూసిందో కానీ ఓ కోతి ఒక్కసారిగా అక్కడికి దూసుకొచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథిలా నేరుగా వెళ్లి ఆ అమ్మాయి పట్టుకున్న స్వీట్ల పళ్లెంలో నుంచి రెండు చేతులతో రెండు స్వీట్లు తీసుకొని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడివారంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత కోతి చేసిన పనికి అంతా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే ఒక మిలియన్ మందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
