ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ పలు రోదసి యాత్రలు చేపడుతుంది. తాజాగా మరో ప్రత్యేక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ‘NS-31 మిషన్’ పేరుతో పూర్తిగా మహిళా సభ్యులతో అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు రెడీ అయింది. అంతేకాదు,ఈ అంతరిక్ష యాత్రలో బెజోస్ ప్రియురాలు, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ ప్రయాణించనున్నారు.
లారెన్ శాంచెజ్‌తో పాటు పాప్ సింగర్ కేటీ పెర్రీ, సీబీసీ న్యూస్ యాంకర్ గైలీ కింగ్, పౌర హక్కుల కార్యకర్త అమందా గుయెన్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవె.. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు. మార్చి-జూన్ మధ్యలో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై కేటీ పెర్రీ స్పందించారు. తాను చేయబోతున్న ఈ యాత్ర తన కుమార్తెతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నానన్నారు. నక్షత్రాలను చేరుకోవాలన్న చాలా మంది కలలు నెరవేరాలని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 2021 నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ సంపన్న పర్యాటకులతో రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 10 మిషన్లలో భాగంగా 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సంస్థ అధినేత జెఫ్ బెజోస్ కూడా న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లి భూమికి తిరిగొచ్చారు. అయితే, ఇప్పుడు పూర్తిగా మహిళా సభ్యులతో యాత్ర చేపడుతోందీ సంస్థ. 1963 తర్వాత పూర్తిగా మహిళలు మాత్రమే వ్యోమనౌకలో వెళ్తున్న మిషన్ ఇదే కావడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్!
ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్.. సింగిల్ ప్రీమియంపై నెలనెల పెన్షన్.. ఎంతంటే

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
