Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్​!

కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్​!

Phani CH

|

Updated on: Mar 05, 2025 | 5:34 PM

రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అందుకే అన్ని వేళలా అలర్ట్‌గా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తూ, తక్కువ స్పీడ్‌తో డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కారులో సిద్ధంగా ఉంచుకోండి. రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, అక్కడే మీ కారును ఆపేయండి.

ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరార్ కావద్దు. దీంతో మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్​ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలాన్ని ఫొటో తీయండి. గాయపడిన వారి ఫొటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకు అయిన గాయాలు, ఇతరులకు అయిన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదంటే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్‌.. సింగిల్‌ ప్రీమియంపై నెలనెల పెన్షన్‌.. ఎంతంటే

భార్యకోసం లగ్జరీ కారుకొన్న భర్త.. ఆమెకు నచ్చకపోవడంతో