ప్రపంచంలోని సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ.. వీరి సంపద ఎంతంటే..
భారత బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ మరో ఘనత సాధించారు. 5 వేల కోట్ల డాలర్ల కు పైగా సంపద కలిగిన 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి అంబానీ, అదానీ చోటు సంపాదించారు. 41,900 కోట్ల డాలర్లు అంటే రూ. 36.45 లక్షల కోట్ల నికర సంపదతో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
26,380 కోట్ల డాలర్లతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలవగా, 9,060 కోట్ల డాలర్లు అంటే రూ.7.88 లక్షల కోట్లతో ముకేశ్ అంబానీ 17వ స్థానంలో, 6,060 కోట్ల డాలర్లు అంటే రూ. 5.27 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ 22వ స్థానంలో నిలిచారు. ఇక, మస్క్ ప్రస్తుతం గంటకు 20 లక్షల డాలర్లు అంటే రూ. 17.4 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో 2027 నాటికి మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అవుతారని అంచనా వేస్తున్నారు. సగటు అమెరికన్ సంపదతో పోలిస్తే మస్క్ సంపద ఏకంగా 20 లక్షల రెట్లు అధికం కావడం గమనార్హం. కాగా, ఈ ఫిబ్రవరి ప్రారంభం నాటికి ప్రపంచంలోని కుబేరుల సంపద మొత్తంలో 16 శాతం ఈ సూపర్ బిలియనీర్లదే కావడం విశేషం. 2014లో ఇది 4 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడది నాలుగు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. వీరి మొత్తం సంపాదన ప్రస్తుతం 3.3 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఫ్రాన్స్ జీడీపీతో సమానమన్నమాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

