ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే
పూలలో గులాబీకి ఉండే ప్రత్యేకతే వేరు. సృష్టిలో ఎన్నో సువాసనలు వెదజల్లే పూలున్నా..గులాబీయే రారాణి. ఈ గులాబీ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ గులాబీ మంటుంటుంది. శుభసమయాల్లో ఎవరికైనా విషెష్ తెలియచేయాలన్నా గులాబీనే మొదటి ఎంపిక అవుతుంది.
ఎలాంటి సమావేశాల్లోనైనా అందరినీ ఇట్టే ఆకర్షించే అందం, ఆకర్షణ గులాబీ సొంతం. ఇదంతా ఓకే… గులాబీల్లోనే అత్యంత అందమైన, ఖరీదైన జూలియట్ గులాబీ గురించి ఎప్పుడైనా విన్నారా? అవును , ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ పువ్వు పేరు జూలియట్ రోజ్. సాధారణంగా ఒక గులాబీ పువ్వు ధర మరీ ఎక్కువ అంటే 100 నుంచి 1000 రూపాయల వరకూ ఉంటుంది. కానీ జూలియట్ గులాబీ ధర వింటే షాకవుతారు. దీనిని అందరూ కొనలేరు. దీని సాగుకూడా అంత సులభం కాదట. అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది. మీరు విన్నది నిజమే.. కోట్లలోనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన గులాబీని ప్రసిద్ధ పూల వ్యాపారి డేవిడ్ ఆస్టిన్ రూపొందించారు. అతను అనేక రకాల గులాబీలను కలిపి దీనిని సృష్టించారు. ఈ అరుదైన గులాబీ జాతిని అభివృద్ధి చేయడానికి అతనికి దాదాపు 15 సంవత్సరాలు పట్టిందట. ఆశ్చర్యపోవలసిన మరో విషయం ఏమిటంటే, 2006 లో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు 10 మిలియన్ పౌండ్లకు అంటే, సుమారు రూ. 90 కోట్లకు అమ్ముడైందట. ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే.. వారి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే అంటున్నారు. అయితే, కాలక్రమేణా దాని ధరలు తగ్గాయి. కానీ, ఇప్పటికీ రూ. 30 మిలియన్లు ధర పలుకుతుందని చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!
అనాథ పిల్లలతో.. హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే
