Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!
సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో సమంతా ఒకరు. ఆమె 2010 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి... స్టిల్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తన యాక్టింగ్‌తో.. తన బ్యూటీతో.. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. అలాంటి ఈ బ్యూటీ.. తన కెరీర్లో కొన్ని సినిమాలు చేయకుండా ఉండాల్సింది అంటూ.. కాస్త బాధపడ్డారు.
తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఏ మాయ చేసావే సినిమాతో సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘బృందావనం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుని.. వరుసగా గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతూ వచ్చారు. అలా తన గ్లామర్‌తో సినిమాకు ప్లస్ అవుతూనే తన యాక్టింగ్‌తోనూ మేకర్స్‌ను, ఆడియన్స్ ను ఫిదా చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నారు. ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న ఈమె.. హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన సమంత.. తన ఫిల్మ్ జర్నీ గురించి చెప్పారు. కొన్ని సినిమాల్లోని క్యారెక్టర్స్ చేయకుండా ఉండాల్సింది అన్నారు. సినిమాల్లో కొన్ని పాత్రలు చేయడానికి తాను చాలా కష్టపడ్డానని.. అయితే ఇప్పుడు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, ఎందుకో తను పోషించిన క్యారెక్టర్ ఫన్నీగా అనిపిస్తుందన్నారు. ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనాథ పిల్లలతో.. హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
