రోడ్డు దాటుతున్న చిరుత.. అటుగా వచ్చిన బైకర్ .. ఆ తర్వాత?
అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇంతలో పక్కనే పొదల్లోంచి ఓ చిరుత పులి ఆ రోడ్డు మీదకు వచ్చింది. అది గమనించని ఓ బైకర్ వేగంగా వచ్చి ఆ చిరుతను ఢీకొట్టాడు. పాపం చిరుత స్పృహ లేకుండా పడిపోయింది. బైక్ కూడా అంతదూరంలో పడింది. ఈ ఘటనతో రోడ్డుకి అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి. అందరూ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూశారు.
ఇంతలో ఊహించని సీన్ జరిగింది. చెన్నై అటవీ ప్రాంతం సమీపంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో గుడలూర్ ప్రాంతానికి చెందిన రాజన్ బైక్‌పై వెళ్లాడు. నడుకాని మరపాలెం వద్దకు వచ్చేసరికి ఓ చిరుత అడవిలోంచి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటుతున్న చిరుతను బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఆ బైక్ రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. స్వల్పగాయాలతో ఆ వ్యక్తి బయటపడ్డాడు. చిరుతకు ఏమైందో.. అదెక్కడ తనపై దాడిచేస్తుందోనని, బైక్ అక్కడే వదిలి అక్కడినుంచి దూరంగా వెళ్లాడు. అయితే బైక్ ఢీకొట్టడంతో చిరుత రోడ్డు మధ్యలో పడిపోయింది. చాలా సేపటి వరకు అది కదలలేదు. అందరూ చిరుత చనిపోయిందేమో అనుకున్నారు.. కానీ దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అయితే ఊహించని విధంగా అది స్పృహలోకి వచ్చింది. లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
