Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

Samatha J

|

Updated on: Mar 05, 2025 | 8:28 PM

ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చిలో మొదలై ఏప్రిల్‌లో మండుటెండలు కాసేవి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండ తీవ్రత పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే భగభగమంటున్నాడు. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతవరణశాఖ హెచ్చరించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మొదటిసారి సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. 124 ఏళ్ల తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఇది నమోదైందని ఆయన వెల్లడించారు. తెలంగాణలోనూ మార్చి నెల మండించనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి 2వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా 36 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించారు. ఫిబ్రవరిలో సాధారణం కంటే 50 శాతం వర్షపాతం తగ్గిదని, గాలిలో తేమకూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. 1901 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో 2025లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో

అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో

ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో

అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో